ola: ఆహార పంపిణీ వ్యాపారంలో మ‌రో అడుగు వేసిన ఓలా!

  • ఫుడ్‌పాండా భార‌త వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్న క్యాబ్ సంస్థ‌
  • 200 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబడి పెట్ట‌నున్న ఓలా
  • ఒప్పంద విష‌యం గురించి ప్ర‌క‌ట‌న జారీ చేసిన కంపెనీ

2014లో ఓలా కేఫేతో ఆహార పంపిణీ వ్యాపారంలోకి అడుగు పెట్టిన క్యాబ్ స‌ర్వీసుల సంస్థ ఓలా మ‌రో ముంద‌డుగు వేసింది. ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ సంస్థ ఫుడ్‌పాండా వారి భార‌త వ్యాపారాన్ని చేజిక్కించుకున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది. జ‌పాన్‌కి చెందిన డెలివ‌రీ హీరో గ్రూప్ నుంచి ఈ సంస్థ‌ను ఓలా స్వాధీనం చేసుకుంది. రానున్న రోజుల్లో ఈ వ్యాపారంలో 200 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ఓలా వెల్ల‌డించింది.

షేర్ల  బదలాయింపులో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. అయితే, లావాదేవీలో భాగమైన వాటాల సంఖ్య వివరాలను అందించలేదు. ప్ర‌స్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో ఓలా కేఫే సేవ‌లు అందిస్తోంది. ఉబెర్ వారి ఉబెర్‌ ఈట్స్‌కు పోటీగా ఈ ఆహార పంపిణీ వ్యాపారాన్ని ఓలా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News