chada venkat reddy: టీఆర్‌ఎస్‌ పార్టీ మహా సభల్లా ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జరుగుతున్నాయి: సీపీఐ నేత చాడ వెంక‌ట‌రెడ్డి

  • రాజకీయ పార్టీల నేత‌ల‌ను ఆహ్వానించలేదు
  • ఉద్య‌మ నాయ‌కుల‌ను ఎందుకు అవ‌మానించారు?
  • గద్దర్‌, విమలక్క లాంటి వారిని ఎందుకు పిల‌వ‌లేదు?

హైదరాబాద్‌లో తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోన్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ఉద్యమ కారులైన గద్దర్‌, విమలక్క లాంటి వారిని ఎందుకు ఆహ్వానించ‌లేద‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్ర‌శ్నించారు. ఉద్య‌మ‌కారుల‌నే కాకుండా రాజకీయ పార్టీల నేత‌ల‌ను కూడా ఆహ్వానించకుండా వారంద‌రిని అవ‌మాన‌ప‌రిచార‌ని మండిప‌డ్డారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ మహా సభల్లా ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ‌ పరిపాలన తెలుగులోనే నిర్వ‌హించాల‌ని ఆయ‌న అన్నారు. కాగా, రాష్ట్రంలో నెల‌కొన్న స‌మస్య‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, ఆదివాసీలు, లంబాడీల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని అన్నారు. 

More Telugu News