akhil: అఖిల్ కి 2 కోట్ల గిఫ్ట్ .. 'హలో' హిట్ కొడితేనే సుమా!

  • అఖిల్ హీరోగా 'హలో' 
  • పారితోషికం అందుకోని అఖిల్ 
  • బహుమతి రూపంలో పారితోషికం 

అఖిల్ రెండవ సినిమాగా .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' రూపొందింది. నాగార్జున నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున - అఖిల్ ఇద్దరూ కూడా బిజీగా వున్నారు. ఈ సినిమాలో చేసినందుకు గాను అఖిల్ కి రెమ్యునరేషన్ ఇవ్వలేదట.

ఈ సినిమా హిట్ అయితే 2 కోట్ల ఖరీదు చేసే గిఫ్ట్ ను అఖిల్ కి నాగార్జున ఇవ్వనున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. అఖిల్ కి లేటెస్ట్ మోడల్ కార్లు అంటే చాలా ఇష్టమట. అందువలన 2 కోట్ల ఖరీదు చేసే ఓ ఇంపోర్టెడ్ కారును బహుమతిగా ఇవ్వాలనే ఆలోచనతో నాగార్జున వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో నాగార్జున .. అఖిల్ తో పాటు, అక్కినేని అభిమానులంతా వున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శిని కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది.           

More Telugu News