nithin: ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ కానుకగా నితిన్ ఫస్టులుక్

  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ 
  • ఇది ఆయనకి 25వ సినిమా 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • జనవరి 1న ఫస్టులుక్ రిలీజ్  

యూత్ లో మంచి క్రేజ్ వున్న కథానాయకులలో నితిన్ ఒకరు. ప్రస్తుతం ఆయన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

 ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖాయం చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలకపోవడంతో, అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను జనవరి 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి కథను త్రివిక్రమ్ అందించడం ఒక విశేషమైతే, ఇది నితిన్ కి 25వ సినిమా కావడం మరో విశేషం. 

More Telugu News