Brahmanandam: బ్రహ్మానందం వాగ్ధాటిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన రాజమౌళి... వీడియో ఇదిగో!

  • హైదరాబాద్ లో వైభవంగా జరుగుతున్న మహాసభలు
  • సోమనను, పోతనను తలచుకుని ప్రసంగాన్ని ప్రారంభించిన బ్రహ్మానందం
  • పద్య పటిమతో దద్దరిల్లిన బమ్మెర పోతన వేదిక
  • కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన బ్రహ్మానందం

హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న హాస్యనటుడు బ్రహ్మానందం, సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ కవి పాల్కురికి సోమనను, ఆపై బమ్మెర పోతనను తలచుకుని ప్రసంగాన్ని ఆరంభించిన ఆయన, తన వాగ్ధాటి, పద్య పటిమతో వేదికను దద్దరిల్లేలా చేశారు. బ్రహ్మానందం వాగ్ధాటిని చూసిన రాజమౌళి, షాక్ తిన్నట్టుగా చూస్తూ, సంభ్రమాశ్చర్యాలతో ఆయన మాటలను విన్నారు.

తన ప్రసంగంలో, అందరూ కేసీఆర్ ను పొగడుతున్నారని తాను కూడా పొగడటం లేదని, ఉన్న విషయాన్ని చెబుతున్నానని అంటూ, ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఓ కుటుంబంలో 9 మంది తరువాత పుట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇప్పుడు మూడున్నర కోట్ల మందికి పెద్దదిక్కయ్యారని అన్నారు. ఇంత అద్భుతమైన తెలుగు మహాసభలను నిర్వహించాలని రాసున్నందునే ఆయన పుట్టారని అనిపిస్తోందని, తెలంగాణ జాతిపిత అని అనిపించుకునే స్థాయికి ఆయన ఎప్పుడో చేరారని కొనియాడారు. తెలంగాణ ప్రజలందరి ముద్దుబిడ్డని ఆయన ఇప్పటికే అనిపించుకున్నారని, తెలుగు భాషపై తనకు ఉన్న అభిమానాన్ని చూపించుకునే ఉద్దేశం కలగడం ప్రజలందరి అదృష్టమని అన్నారు. బ్రహ్మానందం ప్రసంగం వీడియోను మీరూ చూడండి.


More Telugu News