Thane: బాలికకు ఫ్లైయింగ్‌ కిస్‌లు.. ఏడేళ్ల నాటి కేసులో పెయింటర్‌కు జరిమానా!

  • నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు
  • రూ. 5 వేల జరిమానా
  • చెల్లించకుంటే ఐదేళ్ల జైలు

ఏడేళ్ల క్రితం బాలికకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన కేసులో ఓ పెయింటర్‌కు కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. ఒకవేళ పెయింటర్ మందర్ అర్జున్ జగ్‌తప్ (27) జరిమానాను చెల్లించలేని పక్షంలో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.

జగ్‌తప్‌ది థానేలోని వర్తక్ నగర్. 8 జూన్, 2010న స్కూలుకెళ్తున్న తొమ్మిదో తరగతి బాలికను అడ్డగించి ఆమెతో సంభాషణ మొదలుపెట్టాడు. అనంతరం ఆమెకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చాడు.

ఇంటికెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జగ్‌తప్‌ను అరెస్ట్ చేసి ఆపై బెయిలుపై విడుదల చేశారు. కోర్టు వాయిదాల సమయంలో జగ్‌తప్‌ తరచూ డుమ్మాలు కొట్టేవాడని పోలీసులు తెలిపారు. దీంతో తుది తీర్పుకు ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇటువంటి కేసులో దోషికి శిక్ష పడడం ఇదే తొలిసారని పోలీసులు చెప్పారు.

More Telugu News