Ramgopal Varma: నువ్వు 'కడప' అంటే... మేము 'వర్మగారు పోయారు పిచ్చాసుపత్రికి' అంటాం!: సీమ నేతల హెచ్చరిక!

  • ఫ్యాక్షనిజం నేపథ్యంలో వర్మ వెబ్ సీరీస్
  • తామూ ఓ చిత్రం తీస్తామంటున్న ఓసీ సంక్షేమ సంఘం
  • ఆయన తల్లిని, కుమార్తెను కలిసి అభిప్రాయం అడుగుతాం
  • ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తలపెట్టిన 'కడప' వెబ్ సీరీస్ మరింత వివాదంలో చిక్కుకుంది. ఈ వెబ్ సీరీస్ లో తమ ప్రాంతాన్ని తక్కువ చేసి చూపుతున్నారని ఇప్పటికే ఆరోపణలు గుప్పించిన వివిధ పార్టీల రాయలసీమ నేతలు, ఇప్పుడు ఆయనపై ఓ చిత్రాన్ని తీసి విడుదల చేస్తామని హెచ్చరించారు.

'కడప' వెబ్ సీరీస్ ను విడుదల చేస్తే, తాము 'వర్మగారు పోయారు... పిచ్చాసుపత్రికి' అని ఓ సినిమా తీస్తామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సినిమా తీసేముందు ఆయన తల్లిని, కుమార్తెనూ కలిసి వర్మపై అభిప్రాయాన్ని కోరతామని తెలిపారు. కడపలోనే ఫ్యాక్షన్ పుట్టినట్టు చూపిస్తూ, ఈ ప్రాంత ప్రజల్లో మరోసారి విద్వేషాలు సృష్టించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని, వెంటనే తన ప్రయత్నాన్ని వర్మ విరమించుకోవాలని హెచ్చరించారు

More Telugu News