యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్: నా జీవితం మలుపు తిరగడానికి ముగ్గురు హిందీ మాస్టర్లు కారణం: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

  • ఆ ముగ్గురు హిందీ మాస్టర్లలో ఒకరు వెంకట సుబ్బారావు
  • రెండో వ్యక్తి  బండ్లమూడి ఆంజనేయులు
  • మూడో వ్యక్తి... డాక్టర్ ఆదేశ్వర్ రావు: యార్లగడ్డ

తన జీవితం మలుపు తిరగడానికి ముగ్గురు హిందీ మాస్టర్లు కారణమని ప్రముఖ సాహితీవేత్త, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ‘ఏబీఎన్-ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఆ ముగ్గురు హిందీ మాస్టర్లలో ఒకరు.. గుడివాడ ఆంధ్రా నలందలో పనిచేసిన వెంకట సుబ్బారావు గారు, రెండో వ్యక్తి.. గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో విభాగ అధ్యక్షునిగా పనిచేసిన బండ్లమూడి ఆంజనేయులు గారు, మూడో వ్యక్తి... డాక్టర్ ఆదేశ్వర్ రావు గారు. హిందీ ‘చందమామ’కు ఎడిటర్ గా ఉన్న బైరాగి గారికి ఆయన శిష్యుడు. హిందీ సాహిత్యంపై నాకు ఉన్న మక్కువను కనిపెట్టిన ఆదేశ్వర్ రావు గారు, హిందీ సాహిత్యం రుచిని చూపించారు. అప్పటి నుంచి వ్యాసాలు, పుస్తకాలు రాయడం ప్రారంభించాను’ అని తాను ఎదిగిన క్రమాన్ని లక్ష్మీప్రసాద్ గుర్తుచేసుకున్నారు. 

More Telugu News