రామ్‌గోపాల్ వ‌ర్మ‌ని వెంట‌నే అరెస్టు చేయాలి.. లేదంటే కోర్టుకు వెళ‌తాం: పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు

Mon, Dec 18, 2017, 02:03 PM
  • 'కడప' పేరిట వెబ్ సిరీస్ ప్రారంభించిన వ‌ర్మ‌
  • ర‌క్తపుటేరులను గురించి చూపిస్తోన్న వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు
  • రాయలసీమ విమోచన సమితి నాయకుల అభ్యంత‌రం
  • అనంత‌పురం త్రీటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు
'కడప' పేరిట వెబ్ సిరీస్ ప్రారంభించిన వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఆ ప్రాంత‌ ఫ్యాక్షన్ రాజకీయాల గురించి, గొడ‌వ‌లు, ర‌క్తపుటేరులను గురించి చూపిస్తూ మ‌చ్చుకి ఒక వీడియోను వ‌దిలారు. క‌డ‌ప‌లో విద్వేషాలు మ‌రింత రేపేలా ఈ వీడియో ఉండడంతో రాయలసీమ విమోచన సమితి నాయకులు అనంత‌పురం త్రీటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వ‌ర్మ చూపిన ట్రైల‌ర్‌లో క‌డ‌ప‌లోనే హింస పుట్టినట్టుగా చూపార‌ని కూడా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. రామ్‌గోపాల్ వ‌ర్మ‌ని వెంట‌నే అరెస్ట్ చేయక‌పోతే ఈ విష‌య‌మై న్యాయ‌స్థానంలో పిల్ దాఖలు చేస్తామ‌ని చెప్పారు.  
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement