nani: స్టార్ డమ్ గురించి ఎప్పుడూ ఆలోచించింది లేదు: నాని

  • ఓ ప్రేక్షకుడిగానే కథ వింటాను
  • సక్సెస్ వస్తే బాధ్యత పెరిగినట్టు భావిస్తాను 
  • తరువాత సినిమాపై మరింత శ్రద్ధ పెడతాను  

 ఏ సినిమాలో నానిని చూస్తున్నా .. మన పక్కింటి అబ్బాయిని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా ఆయన అంత సహజంగా నటిస్తూ ఉంటాడు. ఈ కారణంగానే ఆయన పేరుకు ముందు నేచురల్ స్టార్ అనే బిరుదు చేరిపోయింది. ఈ ఏడాది రెండు హిట్లు ఇచ్చిన నాని, మూడవ సినిమా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "ఏ కథనైనా ఓ ప్రేక్షకుడిగానే వింటాను .. ప్రేక్షకుడిగా సంతృప్తి చెందిన తరువాతనే ఓకే చెబుతాను" అని అన్నారు. " నేనెప్పుడూ కథ ప్రేక్షకులకు ఎంత దగ్గరగా వుందనే విషయాన్ని గురించి ఆలోచిస్తానే గానీ, స్టార్ డమ్ ను గురించి పట్టించుకోను. హిట్స్ .. ఫెయిల్యూర్స్ కి అతీతుడను అని కూడా అనుకోను. సక్సెస్ వస్తే మరింత బాధ్యత పెరిగినట్టుగానే భావిస్తాను .. ఆ తరువాత సినిమాపై మరింత శ్రద్ధ పెడతాను" అని చెప్పుకొచ్చారు. ఇక తాజా సినిమాతో నాని ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.   

More Telugu News