Salman Khan: త్వ‌ర‌లో 'పార్ట్‌న‌ర్' సినిమాకు సీక్వెల్‌?

  • నిర్మించేందుకు సిద్ధ‌మైన సొహైల్ ఖాన్‌
  • ఇప్ప‌టికే టైటిల్స్ రిజిస్ట‌ర్ చేయించిన నిర్మాత‌
  • మ‌రోసారి సంద‌డి చేయ‌నున్న గోవిందా, స‌ల్మాన్‌

2007లో వ‌చ్చిన రొమాంటిక్, కామెడీ చిత్రం 'పార్ట్‌న‌ర్‌' గుర్తుంది క‌దా! అగ్రనటులు స‌ల్మాన్ ఖాన్, గోవిందా క‌లిసి ఈ సినిమాలో చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు. వారిద్ద‌రినీ వెండితెర మీద చూడ‌టం నిజంగా ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచింది‌. అందుకే ఆ సినిమాను అంతలా ఆద‌రించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న సొహైల్ ఖాన్, ఈ సినిమాకు సీక్వెల్ నిర్మించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. దీనికి సంబంధించి ఆయ‌న టైటిల్స్ కూడా రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సీక్వెల్ చిత్రానికి 'క్యారీ ఆన్ పార్ట్‌న‌ర్', 'పార్ట్‌న‌ర్ 2' అనే రెండు టైటిళ్ల‌ను సొహైల్ రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు స‌మాచారం. అయితే గ‌తంలో కూడా పార్ట్‌న‌ర్‌కి సీక్వెల్ వ‌స్తుందంటూ కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత స‌ల్మాన్‌కి, గోవిందాకి మ‌ధ్య చిన్న గొడ‌వ‌లు రావ‌డంతో సీక్వెల్ నిర్మాణం ఆగిపోయిన‌ట్లు కూడా పుకార్లు వ‌చ్చాయి. అయితే వారిద్ద‌రూ క‌లిసి స‌ల్మాన్ 'వాంటెడ్‌' సినిమాలో క‌నిపించిన త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు రాలేద‌ని అర్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు సొహైల్ టైటిల్స్ రిజిస్ట‌ర్ చేయించడంతో అభిమానులకు పండగే! 

More Telugu News