prapancha telugu maha sabhalu: ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరైన ప్రతినిధులకు షాక్!

  • ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి షాక్
  • రిజిస్ట్రేషన్ లో కనిపించని పేర్లు
  • అంచనాలకు మించి ప్రతినిధులు వస్తుండటంతో ఇబ్బందులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ప్రతినిధులకు షాక్ తగిలింది. ఆన్ లైన్లో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ కార్యాలయ జాబితాలో వారి  పేర్లు కనబడలేదు. దీంతో, వారికి కిట్స్ అందకపోవడంతో పాటు భోజన వసతి కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించడానికి అక్కడకు వచ్చిన టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డికి పలువురు భాషా పండితులు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన ఆయన నిర్వాహకులను పిలిచి, ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరి పేర్లను ఆన్ లైన్లో రిజిస్టర్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ, అంచనాలకు మించి భాషాభిమానులు వస్తుండటంతో, కొన్ని ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. వీటిని అధిగమించడానికి అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. 

More Telugu News