iphone: దిగుమ‌తి సుంకం పెంపుతో ఐఫోన్ రేట్ల‌లో స్వ‌ల్ప మార్పు!

  • రూ. 3000లు పెరిగిన ఐఫోన్ ఎక్స్ ధ‌ర‌
  • ఒక్క ఐఫోన్ ఎస్ఈ మిన‌హా అన్నింటి ధ‌ర‌ల పెంపు
  • ఐఫోన్ ఎస్ఈ భార‌త్‌లో త‌యార‌వ‌డ‌మే కార‌ణం

ఇటీవ‌ల మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలు, టీవీల మీద దిగుమ‌తి సుంకాన్ని పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పెరుగుద‌ల‌కు అనుగుణంగా ఆపిల్ సంస్థ కూడా భార‌త్‌లో ఐఫోన్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించింది. ఒక్క ఐఫోన్ ఎస్ఈ మోడ‌ల్ మిన‌హా మిగ‌తా అన్ని ఐఫోన్ల ధ‌ర‌ల‌ను ఆపిల్ పెంచింది. ఐఫోన్ ఎస్ఈ మోడ‌ల్ గ‌త మే నెల నుంచి భార‌త్‌లో త‌యార‌వుతున్న కార‌ణంగా దీని మీద దిగుమ‌తి సుంకం ఉండదు.

శుక్ర‌వారం రోజున ప్ర‌భుత్వం మొబైల్ ఫోన్ల మీద దిగుమ‌తి సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ ఐదు శాతం పెరుగుద‌ల‌ను స‌రిచేస్తూ ఆపిల్ సంస్థ స‌రాసరిగా ఐఫోన్ల ధ‌ర‌ల‌ను 3.5 శాతం పెంచింది. అధికంగా ఐఫోన్ 6 ధ‌ర‌ను 4.3 శాతం పెంచింది. గ‌తంలో రూ. 29,500 ఉన్న ఐఫోన్ 6 ధ‌ర‌, ఇప్పుడు రూ. 30,780కి చేరుకుంది. అలాగే ఐఫోన్ ఎక్స్ ధ‌ర కూడా దాదాపు రూ. 3000ల‌కు పెరిగింది. ఐఫోన్ ఎక్స్ 64 జీబీ ధ‌ర రూ. 89,000 ఉండేది. ఇప్పుడు రూ. 92,430కి చేరింది.

More Telugu News