Gujarath: బీజేపీని వెనక్కు నెట్టేసిన కాంగ్రెస్... ఆనంద్ జిల్లాలో క్లీన్ స్వీప్ దిశగా దూకుడు!

  • ఈసీ రెండో ప్రెస్ రిలీజ్  
  • కాంగ్రెస్ 44, బీజేపీ 37 చోట్ల ఆధిక్యం
  • నిమిషానికోసారి మారుతున్న ఫలితం

ఇప్పటివరకూ బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ దాన్ని తొలిసారిగా అధిగమించింది. 171 చోట్ల ఫలితాల సరళి తెలుస్తుండగా, కాంగ్రెస్ 89, బీజేపీ 80, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నట్టు 'ఇండియా టుడే' ప్రకటించింది. కాంగ్రెస్ ఆధిక్యం నెమ్మదిగా పెరుగుతూ ఉండటం, నిమిషానికోసారి ఫలితం మారుతుండటంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.

ఏ అభ్యర్థి కూడా ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆనంద్ జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ఏడింటా కాంగ్రెస్ ముందంజలో ఉంది. తొలి రౌండ్ లో వెనుకబడిన ఓబీసీ నేత జిగ్నేశ్, మూడో రౌండ్ తరువాత ఆధిక్యంలోకి రావడం గమనార్హం. ఎన్నికల కమిషన్ ఇచ్చిన రెండో అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల, 37 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి.

More Telugu News