Gujarath: సీన్ మారుతోంది... రెండు, మూడు రౌండ్ల తరువాత స్పీడ్ గా బీజేపీకి దగ్గరైన కాంగ్రెస్... సీఎం విజయ్ రూపానీ వెనుకంజ!

  • తొలి రౌండ్ లో దూసుకెళ్లిన బీజేపీ
  • ఆపై పుంజుకున్న కాంగ్రెస్
  • రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 9 సీట్లు మాత్రమే

తొలి రౌండ్ ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన బీజేపీ, రెండు, మూడు రౌండ్లు ముగిసేసరికి కిందకు దిగివచ్చింది. హిమాచల్ లో దూసుకుపోతున్న బీజేపీ, గుజరాత్ లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఉన్న సీఎం విజయ్ రూపానీ, మూడో రౌండ్ ముగిసేసరికి వెనుకబడ్డారని సమాచారం. తాజా ఫలితాల సరళి ప్రకారం,  182 స్థానాలున్న గుజరాత్ లో 171 స్థానాల సరళి వెలువడుతుండగా, బీజేపీ 89, కాంగ్రెస్ 80, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

తొలి రౌండ్ లో 105 స్థానాల్లో ఆధిక్యం చూపిన బీజేపీ, రెండు, మూడు రౌండ్ల తరువాత 16 స్థానాల్లో వెనక్కు వెళ్లిపోయింది. క్షణక్షణం మారుతున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఏ వైపు మొగ్గు చూపిస్తాయోనన్న విషయం ఇప్పడు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ లో 30 అసెంబ్లీ నియోజకవర్గాల సరళి తెలుస్తుండగా, బీజేపీ 19, కాంగ్రెస్ 12 చోట్ల ముందంజలో వున్నాయి.

More Telugu News