Ashes: ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతం.. యాషెస్ టెస్ట్‌లో ‘బాల్ ఆఫ్ ద సెంచరీ!’

  • బంతి ఎక్కడ పడిందో తెలుసుకునే లోపే ఔటైన ఇంగ్లండ్ ఆటగాడు
  • అది 21వ శతాబ్దపు బంతి అంటూ క్రీడా పండితుల పొగడ్తలు
  • అద్భుతమైన బంతి అంటూ స్టార్క్‌ను కొనియాడిన బాధిత బ్యాట్స్‌మన్

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో అద్భుతం చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతిని ఈ ‘శతాబ్దపు బంతి’గా క్రీడా పండితులు, మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ నిదానంగా  ఆడుతోంది. జేమ్స్ విన్సెన్ అర్ధ సెంచరీతో జోరుమీదున్నాడు.

ఈ క్రమంలో 30 ఓవర్‌లో మిచెల్ స్టార్క్ అద్భుతం చేశాడు. మిడిల్ స్టంప్‌కు ఎదురుగా వేసిన బంతి అనూహ్యంగా తన గమనాన్ని మార్చుకుని మెరుపు వేగంతో వికెట్లను గిరాటేసింది. బంతి ఎక్కడ పడిందో విన్స్ గుర్తించేలోపే జరగరానిది జరిగిపోయింది. బిత్తరపోయిన విన్స్ పెవిలియన్‌కు దారితీశాడు.

స్టార్క్ వేసిన ఈ బంతిని ‘21వ శతాబ్దపు బంతి’గా అభివర్ణిస్తున్నారు. ఇక అవుటైన విన్స్ అయితే అటువంటి బంతిని తాను ఎన్నిసార్లు ఆడినా అవుటవుతూనే ఉంటానని అన్నాడు. ఇది యాషెస్‌కే కాకుండా ఈ శతాబ్దానికే తలమానికమని ఆసీస్ దిగ్గజ  స్పిన్నర్ షేన్ వార్న్ అన్నాడు. తన బౌలింగ్‌ను స్టార్క్ గుర్తు చేశాడని పాక్ మాజీ బౌలర్ వసీం అక్రం అన్నాడు.
<blockquote class="twitter-video" data-lang="en"><p lang="en" dir="ltr">That's just absurd <a href="https://twitter.com/hashtag/Ashes?src=hash&ref_src=twsrc%5Etfw">#Ashes</a> <a href="https://t.co/TtkEDPjbJH">pic.twitter.com/TtkEDPjbJH</a></p>— cricket.com.au (@CricketAus) <a href="https://twitter.com/CricketAus/status/942305553350508544?ref_src=twsrc%5Etfw">December 17, 2017</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


More Telugu News