Taskforce: సినిమా హీరోయిన్ల వ్యభిచారం కేసులో వారిద్దరే కీలకం!

  • శనివారం రాత్రి టాస్క్ ఫోర్స్ దాడుల్లో పట్టుబడిన ఇద్దరు అమ్మాయిలు
  • రిచా సక్సేనాకు బ్రోకర్ తూర్పు గోదావరి జిల్లా జనార్దన్
  • పరారీలో వున్న జనార్దన్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్న పోలీసులు

శనివారం రాత్రి హైదరాబాద్ లోని స్టార్ హోటల్స్ పై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలుగు సినీ, బెంగాలీ టీవీ రంగాలకు చెందిన రిచా సక్సేనా, శుభ్రా చటర్జీలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు ఆన్ లైన్ మాధ్యమంగా వ్యభిచారం నిర్వహిస్తున్న కాస్టింగ్ డైరెక్టర్, మరో ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. పట్టుబడిన అమ్మాయిలను రెస్క్యూ హోమ్ కు తరలించామని, మిగతావారిని రిమాండ్ కు పంపనున్నామని అన్నారు. ఇక ఈ కేసులో ముంబైకి చెందిన మోనిశ్ కపాడియా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనార్దన్ అలియాస్ జానీలు కీలకమని డీసీపీ రాధాకిషన్ రావు వెల్లడించారు.

డి వెంకట్ రావు అనే వ్యక్తిని సహాయకుడిగా నియమించుకున్న జనార్దన్, 40 నుంచి 50 వరకూ వాట్స్ యాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా విటులను ఆకర్షిస్తున్నాడని తెలిపారు. సినిమా, టీవీ నటులను ఈ ఉచ్చులోకి దింపి, ఆపై వారి చిత్రాలను వాట్స్ యాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాడని, ఎవరైనా బుక్ చేసుకుంటే, విమానాల్లో వారిని రప్పిస్తాడని అన్నారు. హోటల్స్ లో రూములు సిద్ధం చేసి, హీరోయిన్స్ ను లోపలికి పంపి, లాబీల్లోనే డబ్బుల లావాదేవీలు పూర్తి చేసుకుంటారని తెలిపారు. ఆపై రూమ్ యాక్సెస్ కార్డులను విటులకు ఇచ్చి, గది నంబర్ చెప్పి పంపుతాడని అన్నారు. ప్రస్తుతం జనార్దన్ తప్పించుకున్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News