గిరిజ‌న తెగ‌లు: గిరిజ‌న తెగ‌లు సంయమనం పాటించాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • ఆదివాసీలు, లంబాడీలు ఐకమత్యంతో ఉండాలి
  • స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది
  • మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండ‌లం హ‌స్నాపూర్‌లో లంబాడీలు, ఆదివాసుల మ‌ధ్య త‌లెత్తిన గొడ‌వ విధ్వంసానికి దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఆదివాసీలు, లంబాడీలు ఐకమత్యంతో ఉండాలని, గిరిజ‌న తెగ‌లు సంయమనం పాటించాలని కోరారు.  .

విబేధాలు, ఘర్షణలతో సమస్యలు ఎంత మాత్రం పరిష్కారం కాదని, చర్చల ద్వారా అది సాధ్యపడుతుందని అన్నారు. ఏదైనా స‌మ‌స్య ఉంటే ప్ర‌భుత్వ దృష్టికి తీసుకురావాల‌ని కోరారు. ప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని, సోషల్‌మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను నమ్మొద్దని సూచించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పడ్డాక అన్ని వ‌ర్గాల‌, ప్రాంతాల అభివృద్ధికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, ఆదివాసీలు, లంబాడీల అభివృద్ధికి ప్ర‌త్యేక చొర‌వ తీసుకుంటున్నార‌ని తెలిపారు.

More Telugu News