‘పద్మావతి’: అసలు వాళ్లకి నిజమైన పద్మావతి కథ తెలుసా?: దర్శకుడు అనురాగ్ బసు

  • ‘పద్మావతి’పై వివాదాలు సృష్టించడంపై మండిపడ్డ అనురాగ్ బసు
  •  సినిమా చూడకముందే వివాదాలు, విమర్శలు ఎలా గుప్పిస్తారు?
  • ఇష్టానుసారం ఊహించుకుని, వివాదాలు ఎలా సృష్టిస్తారు?

వివాదాల కారణంగా ఈ నెల 1వ తేదీన విడుదల కావాల్సిన ‘పద్మావతి’ చిత్రం  వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు స్పందించారు. ఒక సినిమాను చూడకముందే, దానిపై వివాదాలు, విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగానే కాదు, చిరాకూ తెప్పిస్తోందని ఓ ఛారిటీ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాపై వివాదాలు సృష్టించే వారికి నిజమైన పద్మావతి కథ తెలుసా? అని తనకు అనుమానంగా ఉందని అన్నారు. ఇష్టానుసారం ఊహించుకుని, వివాదాలు ఎలా సృష్టిస్తారంటూ ఆయన ప్రశ్నించారు. 

More Telugu News