నవీన్ నిశ్చల్: దూకుడుని తగ్గించుకుంటూ ముందుకెళ్తున్నా!: హిందూపురం వైసీపీ నేత నవీన్ నిశ్చల్

  • 2004 నవీన్ కు, 2017 నవీన్ కు చాలా తేడా ఉంది
  • మా కుటుంబంలోని వాళ్లందరూ ఉద్యోగస్తులే
  • నేను రాజకీయాల్లోకి రావడం దైవ నిర్ణయం
  • ఓ ఇంటర్వ్యూలో నవీన్ నిశ్చల్

తన దూకుడుని తగ్గించుకుంటూ ఒక ఆలోచనా విధానంతో తాను ముందుకెళ్తున్నానని హిందూపురం వైసీపీ నేత నవీన్ నిశ్చల్ అన్నారు. ‘ఐ డ్రీమ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘2004 నవీన్ కు 2017 నవీన్ కు చాలా తేడా ఉంది. దెబ్బలు తగులుతున్నప్పుడు ఈ దారి మనది కాదని అనుకుని, దూకుడుని తగ్గించుకుని, ఆలోచనా విధానంతో ముందుకెళ్తున్నా. ప్రతి యేడు కొత్తపాఠం నేర్చుకుంటున్నా.

మా కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. మా నాన్న గారు డాక్టరు సాయిప్రసాద్ మేథమ్యాటిక్స్ ప్రొఫెసర్. మా కుటుంబంలోని వాళ్లందరూ ఉద్యోగస్తులే. నాన్నగారి స్వస్థలం బుక్కపట్నం. మా అమ్మ పేరు మాలతి. ఆమె గృహిణి. ఉద్యోగరీత్యా మా నాన్న హిందూపురం వచ్చారు. మా అక్క, నేను, నా తమ్ముడు. నేను హిందూపురం, గుంతకల్లులో చదువుకున్నాను. బీఏ వరకు చదువుకున్నా. ఎల్ఎల్ బీ చేస్తూ మధ్యలో ఆపేశా. అసలు, నాకు హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేయాలని ఉండేది. హిందూపురంలో మొదటి బార్ అండ్ రెస్టారెంట్ మాదే (1983లో)’ అని అన్నారు.

‘విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేను కాలేజ్ ఎన్నికల్లో పోటీ చేస్తుండే వాడిని. క్రమంగా రాజకీయాల వైపు ఆసక్తి కలిగింది. మా దూరపు బంధువు గాజుల సోమశేఖర్ 1989లో ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకు మేమందరమూ మద్దతుగా నిలిచాం. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లందరూ సంఘ వ్యతిరేకులని మనం అనుకోకూడదు. మంచి విజన్ ఉన్న వాళ్లు కూడా రాజకీయాల్లోకి రావొచ్చు కదా! నేను రాజకీయాల్లోకి రావడం దైవ నిర్ణయం’ అని నవీన్ నిశ్చల్ చెప్పుకొచ్చారు.

More Telugu News