pavan: దుమ్మురేపేస్తూ దూసుకుపోతోన్న 'అజ్ఞాతవాసి' టీజర్

  • నిన్న సాయంత్రం వచ్చిన టీజర్ 
  • కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్ 
  • ఈ నెల 19న ఆడియో రిలీజ్ 
  • వచ్చేనెల 10న సినిమా విడుదల     

త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్ కి గల క్రేజ్ కారణంగా, 'అజ్ఞాతవాసి' సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్  రావడంతో, అంతకు మించిన ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ సినిమా నుంచి నిన్న సాయంత్రం 6:30 గంటల సమయంలో టీజర్ ను రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన కొంతసేపటికే ఈ టీజర్ టాప్ ట్రెండింగ్స్ లో నిలుస్తూ .. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

 మొదటి 5 గంటల్లోనే టాలీవుడ్ మోస్ట్ లైక్డ్ టీజర్ గా మార్కులు కొట్టేసి, రాత్రి 12 గంటలకే 3.11 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇక హారిక అండ్ హాసిని అఫీషియల్ ఛానల్ ద్వారా ఈ టీజర్ 15 గంటల్లోనే 4.26 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి, 5 మిలియన్స్ మార్క్ ను చేరుకోనుంది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను నిర్వహించి, జనవరి 10వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.     

More Telugu News