hafeez saeed: 1971 యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుందాం: భారత్ పై మరోసారి విషం కక్కిన హఫీజ్ సయీద్

  • భారత్ నుంచి కశ్మీర్ ను వేరుచేయడమే లక్ష్యం
  • 1971 యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటాం
  • ప్రతి పాకిస్థానీ పగతో రగిలిపోతున్నాడు

కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మరోసారి భారత్ పై విషంగక్కాడు. భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయడమే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశాడు. జమాతే ఉద్దవా సంస్థ మద్దతుదారులతో లాహోర్ లో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 1971 యుద్ధానికి భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చాడు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంపై పగ తీర్చుకోవడానికి ప్రతి పాకిస్థానీ ఎదురు చూస్తున్నాడని అన్నాడు.

తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)ను పాక్ నుంచి వేరు చేసినట్టే, భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయాలని మద్దతుదారులను ఉద్దేశించి సయీద్ అన్నాడు. డిసెంబర్ 16ను భారత్, బంగ్లాదేశ్ లు విజయ్ దివస్ గా జరుపుకోవడంపై మండిపడ్డాడు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. లక్షమంది పాక్ సైనికులను భారత సైన్యం బంధించింది. వారిని యుద్ధఖైదీలుగా అదుపులో ఉంచుకుంది. ఆ తర్వాత జరిగిన ఒప్పందాల్లో భాగంగా భారత్ పెద్ద మనసుతో వారందరికీ క్షమాభిక్ష ప్రసాదించి, విడుదల చేసింది. 

More Telugu News