Chennampalli: సర్వత్ర సస్పెన్స్... చెన్నంపల్లి కోటకు చేరుకున్న అధికారులు!

  • రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన చెన్నంపల్లి కోట
  • భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు..20 అడుగుల లోతున సొరంగం
  • దాని చివర భారీ ఎత్తున మెటల్..స్కానర్లలో వెల్లడైన నిజం
  • బంగారమా? మరేదైనానా?  

నిన్న మొన్నటి వరకూ ఎవరికీ పెద్దగా పరిచయం లేని కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ కోటలో పురావస్తు, మైనింగ్ అధికారులు జరుపుతున్న తవ్వకాల తరువాత, భారీ ఎత్తున నిధి నిక్షేపాలు దాచిన ప్రాంతం ఆచూకీ లభించిందని సమాచారం. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతం నుంచి స్పష్టమైన సమాచారం అందడం, ఉన్నతాధికారులు అక్కడికి చేరడంతో, కోట చుట్టూ భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లా ఉన్నతాధికారులతో పాటు అమరావతికి చెందిన పలువురు అధికారులు ఈ ప్రాంతానికి ఇప్పటికే చేరుకున్నారు. గుర్తింపు పొందిన అధికారులు మినహా మరెవరినీ కోటలోకి పంపించడం లేదు. ఈ ప్రాంతంలోని ప్రజలు సైతం కోట వద్దకు భారీగా చేరుకుని, ఏం జరుగుతుందోనన్న విషయాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కోటలోని ఓ గది కిందకు దాదాపు 20 అడుగుల లోతున ఉన్న ఓ రహస్య సొరంగాన్ని కనిపెట్టిన అధికారులు, ఇప్పుడు అది ఎక్కడకు దారి తీస్తుందోనన్న విషయాన్ని స్కానర్ల సాయంతో పరిశీలిస్తున్నారు. ఆ సొరంగం దారి తీస్తున్న ప్రాంతంలోనే భారీ ఎత్తున మెటల్ ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారన్న సంగతి తెలిసిందే.

More Telugu News