mca: మిడిల్ క్లాస్ అబ్బాయిలు హీరోలైపోయార‌నిపిస్తోంది: నేచుర‌ల్ స్టార్ నాని

  • ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతోన్న స‌పోర్ట్ చూస్తోంటే అలా అనిపిస్తోంది
  • ఎమ్‌సీఏ మాకు చాలా స్పెష‌ల్ ఫిలిం అయిపోయింది
  • ఎమ్‌సీఏ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు
  • వ‌రంగ‌ల్‌లో ఈ రోజు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

మిడిల్ క్లాస్ అబ్బాయిలు హీరోలైపోయార‌నిపిస్తోందని నేచుర‌ల్ స్టార్ నాని అన్నాడు. నాని, సాయిప‌ల్ల‌వి జంట‌గా తెరకెక్కిన 'ఎమ్‌సీఏ' చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో ఈ రోజు 'ఎమ్‌సీఏ' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ... 'ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతోన్న స‌పోర్ట్ చూస్తోంటే ఈ రోజు ప్ర‌తి మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అయిపోయాడ‌నిపిస్తోంది. ఈ సినిమా మొత్తం వరంగ‌ల్ లోనే షూట్ చేశాం. ఇంటిని వ‌దిలేసి వ‌చ్చి ఇక్క‌డే ఉన్నాం. కానీ ఏ రోజూ ఇంటిని మిస్ అవుతున్నామ‌న్న భావ‌న క‌ల‌గ‌లేదు. అలా చూసుకున్నారు మీరు. ఎమ్‌సీఏ మాకు చాలా స్పెష‌ల్ ఫిలిం అయిపోయింది. నాకు, మా సినిమా టీమ్‌కి స‌హ‌క‌రించిన వారందికీ ధ‌న్య‌వాదాలు' అని అన్నాడు.

More Telugu News