warangal: మీ అమ్మాయిలా న‌న్ను ఆద‌రిస్తున్నారు: వ‌రంగ‌ల్‌లో సాయిప‌ల్ల‌వి

  • వ‌రంగ‌ల్‌లో ఎమ్‌సీఏ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
  • ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు-సాయిప‌ల్ల‌వి
  • మీరంద‌రూ చాలా హ్యాపీగా ఉండాలి
  • భూమిక‌ను చూసి చాలా నేర్చుకున్నాను

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని, సాయిప‌ల్ల‌వి జంట‌గా తెరకెక్కిన ఎమ్‌సీఏ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. వ‌రంగ‌ల్‌లో ఈ రోజు ఎమ్‌సీఏ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సాయిప‌ల్ల‌వి తెలుగులో మాట్లాడి అల‌రించింది.

 "అంద‌రికీ న‌మ‌స్కారం.. మా కోసం ఇక్క‌డికి వ‌చ్చిన మీ అంద‌రికీ చాలా చాలా ధ‌న్య‌వాదాలు. వేణుగారు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా తీశారు. ఆయ‌న భ‌విష్య‌త్తులోనూ విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాను. భూమిక‌గారు ఇక్కడ లేరు.. ఆమెకు నేను ఓ విష‌యం చెప్పాలి.. ఆమె నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆమె మంచి న‌టి. ఆమె మ‌రెన్నో సినిమాల్లో న‌టించాల‌ని ఆమెతో చెబుతాను.

దేవిశ్రీ మంచి సంగీతం అందించారు. ఈ సినిమా కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. మీ అమ్మాయిలా న‌న్ను ఆద‌రిస్తున్నందుకు చాలా చాలా ధ‌న్య‌వాదాలు. మీరంద‌రూ చాలా హ్యాపీగా ఉండాలి. నాని గారు హార్డ్ వ‌ర్క‌ర్‌" అని పేర్కొంది.

More Telugu News