castes: కులవాదం ఇలాగే పెరిగిపోతే చాలా ప్ర‌మాదం: ఆర్ఎస్ఎస్ హెచ్చ‌రిక

  • కుల‌వాదం వ‌ల్ల‌ జాతీయత భావం దెబ్బతింటుంది
  • సామాజిక సామరస్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది
  • కులవాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం

వెంటనే సామాజిక సామరస్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయ‌ప‌డింది. కుటుంబ విలువలు-జాతీయ సామరస్యం అంశాలపై జోధ్‌పూర్‌ లో ఆర్ఎస్ఎస్‌ రెండు రోజులపాటు సమావేశం ఏర్పాటు చేసి చ‌ర్చించింది. ఆధునిక కాలంలోనూ కులం పేరుతో కొన‌సాగుతోన్న‌ వివక్షపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే జాతీయత భావం దెబ్బతింటుందని, ఇది దేశానికే ప్రమాదం అని పేర్కొంది.

కులం వ‌ల్ల‌ జాతీయత భావం దెబ్బతింటుందని చెప్పింది. దేశంలో కులవాదం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఆర్ఎస్ఎస్ నేత‌లు పేర్కొన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ గుజరాత్‌ ఎన్నికల్లో ఆ విషయం తెలిసింద‌ని అన్నారు. కులవాదాన్ని ఆర్ఎస్ఎస్‌ తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు.

More Telugu News