Pawan Kalyan: అదరగొట్టేస్తోన్న 'అజ్ఞాతవాసి' టీజర్!

  • పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం
  • టీజర్ కి మంచి మార్కులు
  • వచ్చేనెల 10వ తేదీన సినిమా విడుదల 

పవన్ 25వ సినిమాగా 'అజ్ఞాతవాసి' ప్రత్యేకతను సంతరించుకుంది. త్రివిక్రమ్ .. పవన్ కాంబినేషన్లో వస్తోన్న మూడవ సినిమా కావడం కూడా ఈ సినిమాకి మరో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ సినిమా పోస్టర్స్ కి .. ఇప్పటికే వదిలిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు.

త్రివిక్రమ్ తనదైన శైలిలో .. పవన్ అభిమానులు ఆశించిన స్థాయిలోనే ఈ టీజర్ ను కట్ చేశారు. టీజర్ కోసం ఎదురుచూస్తోన్న వాళ్లంతా సంతృప్తిని చెందేలా ఆయన శ్రద్ధ తీసుకున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చేనెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూసేలా త్రివిక్రమ్ ఈ టీజర్ తో చేయగలిగారు. టీజర్ తో అదరగొట్టేసిన త్రివిక్రమ్ .. సినిమా విడుదల తరువాత సంచలనానికి తెరతీస్తారేమో చూడాలి.  

More Telugu News