vanitha reddy: 'ఎలాంటి వాడో చూడండి' అంటూ నటుడు విజయసాయికి సంబంధించిన ప్రైవేటు ఫొటోలు సెండ్ చేసిన వ‌నితా రెడ్డి!

  • మ‌రిన్ని ఫొటోలు, వీడియోలు త్వ‌ర‌లోనే పంపుతాను
  • నా భ‌ర్త‌ ఇత‌ర యువ‌తుల‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు
  • నేను ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా ఉంటున్నందుకు పోలీసుల‌కు క్ష‌మాప‌ణ‌లు

హాస్య‌నటుడు విజ‌య్‌సాయి ఆత్మ‌హ‌త్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన విజ‌య్ భార్య వ‌నితా రెడ్డి ఈ రోజు సెల్ఫీ వీడియోలో మాట్లాడిన విష‌యం తెలిసిందే. త‌న భ‌ర్త ఇత‌ర యువ‌తుల‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని తెలుపుతూ ఆయ‌న‌కు సంబంధించిన రెండు ఫొటోల‌ను విడుద‌ల చేసింది. అందులో విజ‌య్ ఇత‌ర అమ్మాయిల‌తో జ‌ల్సా చేస్తోన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

ఈ రెండు ఫొటోలే కాక విజ‌య్‌కు ఇత‌ర యువ‌తుల‌తో సంబంధాలున్న‌ట్లు తెలిపే మ‌రిన్ని ఫొటోలు, వీడియోలు, ఆడియోలు త‌న‌ ద‌గ్గ‌ర ఉన్నాయని ఆమె తెలిపింది. విజ‌య్ విశ్వ‌రూపం అంద‌రికీ తెలియాలని ఈ ఫొటోలు పంపుతున్నానని చెప్పింది. త‌న ద‌గ్గ‌ర‌ ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని, అవి త‌న వ‌ద్ద‌కు త్వ‌ర‌లోనే వ‌స్తాయని పేర్కొంది.

తాను ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా ఉంటున్నందుకు పోలీసుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నానని తెలిపింది. త‌న‌కు సినిమా, సీరియ‌ల్స్ అవ‌కాశాల‌న్నీ ఇప్పుడు పోయాయని, నిజ‌నిజాలు తెలుసుకుని మీడియా త‌న‌కు సాయం చేయాల‌ని ఆమె కోరింది.

More Telugu News