sudheer babu: ఇంద్రగంటి కథలో ఇంటికి ప్రాముఖ్యత .. అందుకే ఇంటి సెట్!

  • ఇంద్రగంటి తదుపరి చిత్రం మొదలు 
  • సుధీర్ బాబు జంటగా అదితీ రావు
  • కథలో ఇంటికి ప్రత్యేక స్థానం  

ఇంద్రగంటి మోహనకృష్ణ పేరు వినగానే 'అష్టా చెమ్మా' .. 'జెంటిల్ మేన్' ' అమీ తుమీ' వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. పాత్రలను మలిచే విధానంలోను .. కథా కథనాలను ఆసక్తికరంగా నడిపించడంలోను ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి వుంది. తాజాగా ఆయన సుధీర్ బాబు .. అదితీరావు జంటగా ఒక సినిమాను రూపొందిస్తున్నారు.

 ఈ సినిమాలో వాళ్లు వుండే ఇంటికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందట. అంటే .. ఇల్లు కూడా ఒక పాత్రలా కనిపిస్తుందని అంటున్నారు. ఈ కారణంగా ఆ ఇల్లు ప్రత్యేకతను సంతరించుకోనుందట. అందువలన అలాంటి ఇల్లు కోసం గాలించిన యూనిట్ సభ్యులకు నిరాశే ఎదురైంది. దాంతో ఇంటి 'సెట్' వేయించి అందులో షూటింగ్ మొదలుపెట్టేశారు. మొత్తానికి ఈ సారి కూడా ఇంద్రగంటి నుంచి ఒక విభిన్నమైన సినిమా రానుందన్న మాట.             

More Telugu News