priyanka gandhi: తల్లి సోనియాగాంధీ స్థానంలోకి ప్రియాంకా గాంధీ రానున్నారా...?

  • తల్లి సోనియాగాంధీ రిటైర్మెంట్ తో ఊహాగానాలకు అవకాశం
  • రాయ్ బరేలీ నుంచి 2019లో పోటీ చేసే అవకాశాలు?
  • పోటీ చేయాలని కోరుకుంటున్న అభిమానులు

సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రానున్నారా...? 2019 ఎన్నికల్లో సోనియా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారా..? ఇప్పుడు ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ శుక్రవారం ప్రకటన చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజా ఊహాగానాలకు ఈ ప్రకటనే తావిచ్చింది. సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నందున రాయ్ బరేలీ స్థానంలో కుమార్తె ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మాజీ ప్రధాని ఇందిగాంధీకి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గయప్రసాద్ ‘ప్రియాంకా గాంధీ రాజకీయ రంగ ప్రవేశంపై ఎంతో ఆసక్తితో ఉన్నట్టు’ 2010లో తాను మరణించడానికి ముందే చెప్పారు. ఈ విషయాన్ని గయప్రసాద్ కుమారుడు జగదీష్ శుక్లా రాయ్ బరేలీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా గుర్తు చేశారు. ‘‘రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రియాంకా తన ఆలోచనల పట్ల మరింత నిక్కచ్చిగా ఉంటారు. రాహుల్ కాస్త మితభాషి. రాజకీయాల్లో వీరి కలయిక చక్కగా సరిపోతుంది. 2019 ఎన్నికల్లో ప్రియాంకా రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారన్న ఆశాభావంతో ఉన్నాం’’ అని జగదీష్ శుక్లా చెప్పారు.

More Telugu News