స్టాక్ మార్కెట్లు: కళకళలాడిన స్టాక్ మార్కెట్లు.. మదుపరుల్లో జోష్!

  • దేశీయ మార్కెట్లపై ఎగ్జిట్ పోల్స్ ప్రభావం 
  • ఈరోజు ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
  • లాభాల బాటలో వేదాంత, ఎం అండ్ ఎం, తదితర సంస్థల షేర్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే ఎగ్జిట్ పోల్స్ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడటంతో లాభాల బాటపడ్డాయి. ఈరోజు ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల జోరును కొనసాగించాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ 216.27 పాయింట్లు లాభపడి, 33,462.97 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 81.15 పాయింట్ల లాభంతో 10,333.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక షేర్ల విషయానికొస్తే.. వేదాంత, ఎం అండ్ ఎం, యస్ బ్యాంకు, కోల్ ఇండియా, హిందాల్కో తదితర షేర్లు లాభపడగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, బాష్, సిప్లా, టెక్ మహీంద్రా సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.

More Telugu News