21st century fox: ట్వంటీఫ‌స్ట్ సెంచ‌రీ ఫాక్స్ నిర్మాణ సంస్థ‌ను చేజిక్కించుకున్న డిస్నీ

  • 52.4 బిలియ‌న్ డాల‌ర్లకు కుదిరిన ఒప్పందం
  • ఫాక్స్ వారి నేష‌న‌ల్ జియోగ్ర‌ఫీ, స్టార్ టీవీలు డిస్నీ సొంతం
  • నెట్‌ఫ్లిక్స్‌కి పోటీ ఇచ్చే అవ‌కాశం

ప్రఖ్యాత హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ట్వంటీఫ‌స్ట్ సెంచ‌రీ ఫాక్స్‌ను, మ‌రో నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ సొంతం చేసుకుంది. 52.4 బిలియ‌న్ డాల‌ర్ల ఒప్పందంతో ఫాక్స్ సంస్థ‌కు చెందిన స్టూడియోలు, నేష‌న‌ల్ జియోగ్ర‌ఫీ నెట్‌వ‌ర్క్‌, ఆసియాలోని స్టార్ టీవీల‌ను చేజిక్కించుకుంది. అలాగే స్కై, హులూ, ఇత‌ర ఫాక్స్ స్థానిక నెట్‌వ‌ర్క్‌లలో షేర్ల‌ను కూడా డిస్నీ పరమయ్యాయి. ఈ ఒప్పందంతో ఫాక్స్ సీఈఓ జేమ్స్ ముర్దోక్ వైదొల‌గ‌నున్నారు.

ఈ విలీనం ద్వారా డిస్నీ శ‌క్తిమంత‌మైన ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌గా ఎదిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వెబ్‌ స్ట్రీమింగ్ స‌ర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కి పోటీగా మ‌రో కొత్త స్ట్రీమింగ్ స‌ర్వీస్‌ను ఆవిష్క‌రించేందుకు డిస్నీ ఎప్ప‌ట్నుంచో ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ త‌మ ఉత్పత్తులకు సంబంధించి ఎక్కువ డేటా లేక‌పోవ‌డంతో అది ఆగిపోయింది. ఇప్పుడు ఫాక్స్ విలీనం వ‌ల్ల ఎక్స్‌మెన్‌, సింప్స‌న్స్‌, ఫ్యామిలీ గై వంటి ప్రతిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మాలు వారి సొంత‌మ‌య్యాయి. దీంతో ఇప్పుడు ఒక స్ట్రీమింగ్ స‌ర్వీస్ ను ప్రారంభించే స్థాయి డిస్నీకి వ‌చ్చిన‌ప్ప‌టికీ, నెట్‌ఫ్లిక్స్ నుంచి గ‌ట్టిపోటీని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

More Telugu News