triple talaq: ట్రిపుల్ త‌లాక్ చెబితే మూడేళ్ల జైలు శిక్ష‌.. బిల్లుకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం!

  • ముస్లిం మ‌హిళ‌ల జీవితాల‌ను రోడ్డు పాలు చేస్తోన్న ట్రిపుల్ త‌లాక్‌
  • శీతాకాల స‌మావేశాల్లోనే పార్ల‌మెంటులో బిల్‌
  • ట్రిపుల్ త‌లాక్ చెబితే చ‌ట్ట ప్ర‌కారం నేరం

ముస్లిం మ‌హిళ‌ల జీవితాల‌ను రోడ్డు పాలు చేస్తోన్న ట్రిపుల్ త‌లాక్‌పై నిషేధం విధిస్తూ చట్టం చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూపొందించిన ట్రిపుల్ త‌లాక్ నిషేధ బిల్లుకు ఈ రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ రోజు ప్రారంభ‌మైన‌ శీతాకాల పార్ల‌మెంటు స‌మావేశాలు రేప‌టికి వాయిదా ప‌డ్డ త‌రువాత మంత్రివర్గం భేటీ అయి దీనికి ఆమోదం తెలిపి, పార్ల‌మెంటుకు పంపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ బిల్లు ప్ర‌కారం ఇక‌పై 'ముమ్మారు త‌లాక్' చ‌ట్ట‌ప్ర‌కారం నేరం కానుంది. ఈ నేరానికి గానూ దోషికి మూడేళ్ల జైలు శిక్ష ప‌డుతుంది.   

More Telugu News