janasena: దురుద్దేశంతోనే త‌ప్పుదారి ప‌ట్టించారు: జ‌న‌సేన కార్యాల‌య భూ య‌జ‌మాని

  • జ‌లీల్ అనే వ్య‌క్తిపై భూ క‌బ్జాలు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి
  • మా నాన్న సుబ్బారావు 1958లో ఆ స్థ‌లం కొనుగోలు చేశారు
  • అప్పటి నుంచీ అందులోనే సాగుచేసుకుంటున్నామన్న స్థల యజమాని  

ఏపీ రాజధాని సమీపంలో పార్టీ కార్యాల‌య నిర్మాణం కోసం జ‌న‌సేన పార్టీ మూడేళ్ల‌కు లీజుకు తీసుకున్న స్థ‌లం వివాదంలో ప‌డిన విష‌యం తెలిసిందే. మంగ‌ళగిరిలోని చిన‌కాకానిలో ఆ స్థ‌లం ఉంది. కొంద‌రు ఆ భూమిపై చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై భూ య‌జ‌మాని వెంక‌టేశ్వ‌ర‌రావు మీడియాతో మాట్లాడారు. త‌న‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఏ కేసులూ లేవని, ఇన్నేళ్ల‌లో తాను ఒక్క రోజు కూడా కోర్టుకు వెళ్ల‌లేదని తెలిపారు.

త‌న‌ తండ్రి సుబ్బారావు 1958లో ఆ స్థ‌లం కొనుగోలు చేశారని, అప్ప‌టి నుంచీ తాము సాగు చేసుకుంటున్నామ‌ని భూ య‌జ‌మాని చెప్పారు. జ‌లీల్ అనే వ్య‌క్తిపై భూ క‌బ్జాలు, కిడ్నాప్ కేసులు ఉన్నాయని, ఆయ‌న దురుద్దేశంతోనే ఆ స్థలం విషయాన్ని వివాదం చేశారని స్ప‌ష్టం చేశారు.  

More Telugu News