varun tej: కొత్త దర్శకుడికి ఓకే చెప్పేసిన వరుణ్ తేజ్!

  • వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'తొలిప్రేమ'
  • తదుపరి సినిమా సంకల్ప్ రెడ్డితో
  • దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా  

ప్రస్తుతం వరుణ్ తేజ్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలి ప్రేమ' సినిమా చేస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ .. దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టుగా తెలుస్తోంది.

 ఈ సినిమా షూటింగ్ మొదలుకాకుండానే మరో యువ దర్శకుడికి కూడా వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. నూతన దర్శకుడు శశి వినిపించిన కథ నచ్చడంతో వెంటనే ఆయన ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజు ముందుకు రావడం విశేషం. ఆయన ఎంటర్ కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.     

More Telugu News