Hyderabad: ఇక బిచ్చగాళ్లు లేని భాగ్యనగరం.. వారి ఆచూకీ చెబితే రూ.500 బహుమానం!: సర్కారు చర్యలు

  • యాచకులను పట్టుకునే చర్యలు తిరిగి ప్రారంభం
  • ఈ నెల 20 నాటికి పూర్తి
  • 25 నుంచి కనిపిస్తే ఆచూకీ చెప్పాలని పిలుపు

భాగ్యనగరంలో గత నెలలో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు గుర్తుండే ఉంటుంది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఎంతో మంది హాజరైన ఈ సదస్సుకు ముందుగా జంట నగరాల్లో రోడ్లపై యాచించే వారిని పట్టుకుని తీసుకెళ్లే కార్యక్రమాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. సదస్సు ముగిసిన తర్వాత మళ్లీ షరా మామూలే అనుకున్నారు అందరూ.

 కానీ, ఈ నెల 20 నాటికి నగరాన్ని బిచ్చగాళ్ల రహితంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తాజాగా తెలిపారు. ఈ నెల 1 నుంచి తిరిగి రోడ్లపై యాచకులను పట్టుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఎక్కడైనా యాచకులు కనిపిస్తే వారి గురించి 040-24511791, 040-24527846 నంబర్లకు కాల్ చేసి చెప్పాలని ఆయన కోరారు. వివరాలు ఇచ్చిన వారికి రూ.500 బహుమానం కూడా చెల్లిస్తామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 480 మంది యాచకులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చామని, వీరిలో 401 మందిని బంధువులకు అప్పగించగా, మిగిలిన వారు ఆనందాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నట్టు తెలిపారు.

More Telugu News