mohan lal: యంగ్ లుక్ లో మోహన్ లాల్!

  • మోహన్ లాల్ తాజా చిత్రంగా 'ఒడియన్'
  • మాణిక్కన్ పాత్రలో యంగ్ లుక్ 
  • కసరత్తుతో తగ్గిన 20 కేజీల బరువు

మోహన్ లాల్ తాజాగా చిత్రంగా 'ఒడియన్' రూపొందుతోంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆయన 'ఒడియన్ మాణిక్కన్' పేరు గల పాత్రను పోషిస్తున్నారు. 57 సంవత్సరాల వయసున్న మోహన్ లాల్ .. ఈ సినిమాలో కొంత యంగ్ లుక్ తో కనిపించనున్నారు. దాంతో ఆయన నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేకమైన డైట్ ను పాటిస్తూ .. ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటూ 20 కేజీల వరకూ బరువు తగ్గారట.

 ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఆయన లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ఈ పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతగా కష్టపడ్డారో అర్థమవుతోంది. 'మన్యం పులి' సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన పీటర్ హెయిన్స్ ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నారట. మోహన్ లాల్ కెరియర్లో ఈ సినిమా.. ఈ పాత్ర చెప్పుకోదగినవిగా నిలిచిపోతాయని అంటున్నారు.  

More Telugu News