oscar: ఆస్కార్ బ‌రి నుంచి 'న్యూట‌న్‌' చిత్రం అవుట్‌!

  • ఉత్త‌మ‌ విదేశీ చిత్రం కేట‌గిరీలో బ‌రిలోకి దిగిన భార‌తీయ చిత్రం
  • ఫైన‌ల్ జాబితాకు ఎంపిక కాలేక‌పోయిన సినిమా
  • చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అమిత్ వి. మ‌సుర్కార్‌

2018 ఆస్కార్ అవార్డుల నామినేష‌న్ల‌లో ఉత్త‌మ విదేశీ చిత్రం కేట‌గిరీలో బ‌రిలోకి దిగిన 'న్యూట‌న్' చిత్రం ఫైన‌ల్ జాబితాలో చోటు సాధించ‌లేక‌పోయింది. ఈ ఏడాది ఉత్త‌మ విదేశీ చిత్రం కేట‌గిరిలో పోటీ ప‌డుతున్న తొమ్మిది చిత్రాల ఫైన‌ల్ జాబితాను అకాడమీ త‌మ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్ల‌డించింది.

ఈ జాబితాలో రాజ్‌కుమార్ రావ్ న‌టించిన న్యూట‌న్ చిత్రానికి చోటు ద‌క్క‌లేదు. అలాగే ఏంజెలీనా జోలీ న‌టించిన 'ఫ‌స్ట్ దే కిల్డ్ మై ఫాద‌ర్‌' చిత్రం కూడా ఈ జాబితాలో స్థానం ద‌క్కించుకోలేక‌పోయింది. దేశంలో ఎన్నిక‌ల విధానం క‌థాంశంగా వ‌చ్చిన 'న్యూటన్' చిత్రానికి అమిత్ వి. మ‌సుర్కార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఫైన‌ల్ జాబితాలో ఉన్న తొమ్మిది చిత్రాలు ఇవే!

  • ఎ ఫాంటాస్టిక్ ఉమెన్ (చిలీ)
  • ఇన్ ద ఫేడ్ (జ‌ర్మ‌నీ)
  • ఆన్ బాడీ అండ్ సోల్ (హంగేరీ)
  • ఫాక్స్‌ట్రాట్ (ఇజ్రాయెల్‌)
  • ది ఇన్‌స‌ల్ట్ (లెబ‌నాన్‌)
  • ల‌వ్‌లెస్ (ర‌ష్యా)
  • ఫెలిసిటే (సెనెగ‌ల్‌)
  • ద వూండ్ (ద‌క్షిణాఫ్రికా)
  • ద స్క్వేర్ (స్వీడ‌న్‌)
జ‌న‌వ‌రి 23న అకాడ‌మీ అవార్డుల నామినేష‌న్ల జాబితాను వెల్ల‌డించ‌నున్నారు. మార్చి 4న లాస్ఏంజెలీస్‌లోని డాల్బీ థియేట‌ర్‌లో అవార్డుల ప్ర‌దాన వేడుక జ‌ర‌గ‌నుంది.

More Telugu News