‘రాయలసీమ మగోళ్లు అమ్మ కడుపులో నుంచే కత్తి పట్టుకుని పుడతారు’: రాంగోపాల్ వర్మ ట్రైలర్

Fri, Dec 15, 2017, 10:34 AM
  • వర్మ సంచలన ట్రైలర్
  • ట్రైలర్ నిండా ఫ్యాక్షన్ నేతల కొటేషన్లు
  • హింసాత్మక సన్నివేశాలు 
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘కడప రెడ్ల నిజాల’ వెంట పడ్డారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలపై వెబ్ సిరీస్ లను తీసుకొస్తానని ప్రకటించిన ఈ దర్శకుడు ‘కడప వెబ్ సిరీస్ ట్రైలర్ సీజన్ 1’ పేరుతో తాజా ట్రైలర్ ను యూట్యూబ్ లో పెట్టేసి దాని తాలూకూ లింక్ ను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు. ఈ ట్రైలర్ లో వర్మ సంచలన కొటేషన్స్ కూడా కోట్ చేశారు. ఫ్యాక్షన్ రాయలసీమ ప్రజల జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేసిందీ వర్మ తన వ్యాఖ్యానం రూపంలో వినిపించారు.

రాయలసీమ మగోళ్లు అమ్మ కడుపులో నుంచే కత్తి పట్టుకుని పుడతారు
- అక్కడి వాళ్ల నమ్మకం 
కన్నుకి కన్ను సమాధానం కాని సమాధానం.
- రాజశేఖర్ రెడ్డి 
పగలేని బతుకు బతుకే కాదు
- బాంబుల శివారెడ్డి
ఈ తరహా కొటేషన్లు డిస్ ప్లే చేస్తూ... గొడ్డళ్లతో నరికే సీన్లతో ట్రైలర్ విడుదల చేసి వర్మ తన మార్కు మారదని గుర్తు చేశారు. ట్రైలర్ చివర్లో ‘ఫ్యాక్షన్ అమ్మ వెలిసింది సీమలో. ఆ అమ్మ గుడి రాయలసీమ అయితే దాని గర్భగుడి కడప. ఇది రాయలసీమ రెడ్ల చరిత్ర’ అంటూ ముగించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad