India: కూలిన భారత్-చైనా ఏకైక వారధి.. కొంప ముంచిన అధిక బరువు

  • 2013లో రెండు దేశాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం
  • ఒకేసారి రెండు ట్రక్కులు వంతెనపైకి రావడంతో ప్రమాదం
  • గంగోత్రికి తెగిపోయిన సంబంధాలు 

భారత్-చైనా మధ్య ఉన్న ఏకైక వారధి గురువారం అకస్మాత్తుగా కూలిపోయింది. 2013 గంగోత్రి జాతీయ రహదారిపై ఉత్తరకాశీ-చైనా సరిహద్దులను కలుపుతూ దీనిని నిర్మించారు. ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల తర్వాత బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఈ బ్రిడ్జిని నిర్మించింది. ఈ వంతెన పైనుంచి ఒకసారి ఒక ట్రక్కు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు.

అయితే నిబంధనలకు విరుద్ధంగా గురువారం ఒక్కసారిగా రెండు ట్రక్కులు వంతెన మధ్యకి వచ్చాయి. దీంతో అధిక బరువుకు తట్టుకోలేని బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. బ్రిడ్జి కూలిపోయి సంబంధాలు తెగిపోవడంతో ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని సిద్ధం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వంతెన కూలడంతో గంగోత్రి, మనేరి, హార్సిల్ సహా పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

More Telugu News