కర్నూలు: కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

  • 19 నుంచి 26 వరకు నామినేషన్ల స్వీకరణ
  • 27న నామినేషన్ల పరిశీలన .. 29న నామినేషన్ల ఉపసంహరణ
  • 2018 జనవరి 12న ఎన్నికలు .. జనవరి 16న కౌంటింగ్

కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి చక్రపాణిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్ లో వివరాలను తెలిపారు. రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వ్యవహరిస్తారని చెప్పారు. అనంతరం ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, ఓటర్ల వివరాల ప్రతిని వెల్లడిస్తామని, దీనిపై అభ్యంతరాలుంటే వారం రోజుల్లో తెలియజేయాలని అన్నారు.

* ఈ నెల 19 నుంచి 26 వరకు నామినేషన్ల స్వీకరణ
* 27న నామినేషన్ల పరిశీలన
* 29న నామినేషన్ల ఉపసంహరణ
* 2018 జనవరి 12న మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు  
* జనవరి 16న కౌంటింగ్

More Telugu News