Gujarath: గుజ‌రాత్‌లో ముగిసిన పోలింగ్.. పీపుల్స్‌ పల్స్‌ సర్వే వివ‌రాలు.. కాసేప‌ట్లో ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు

  • ఈ నెల 18న గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు
  • హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో బీజేపీ గెలుస్తుంది: పీపుల్స్‌ పల్స్‌ సర్వే 
  • గుజ‌రాత్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న మోదీ, రాహుల్‌
  • సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు 63 శాతం పోలింగ్ న‌మోదు

గుజ‌రాత్‌లో అసెంబ్లీ రెండోద‌శ‌ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఈ నెల 18న గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ఏఐసీసీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని ప్ర‌చారం కొన‌సాగించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు 63 శాతం పోలింగ్ న‌మోదైంది. గుజ‌రాత్‌లో 22 ఏళ్లుగా బీజేపీ పాల‌న ఉంది. కాసేప‌ట్లో ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు రానున్నాయి.  

కాగా, ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో బీజేపీ గెలుస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే ద్వారా తెలుస్తోంది. అక్టోబర్‌ 23 నుంచి 30 వర‌కు నిర్వహించిన పీపుల్స్‌ పల్స్‌ సర్వే జ‌రిగింది. ఈ స‌ర్వే ప్ర‌కారం 68 మంది సభ్యులున్న హిమాచల్‌ అసెంబ్లీలో బీజేపీ 39-44 సీట్లు గెలుపొందుతుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్‌ 19-24 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమవుతుంది.

More Telugu News