nani: హనుమకొండలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • 'మిడిల్ క్లాస్ అబ్బాయి'గా వస్తోన్న నాని 
  • 16వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 21వ తేదీన సినిమా విడుదల    

దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా రూపొందింది. నాని .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా, యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని .. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నామని చెప్పారు.

 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వరంగల్ జిల్లా హనుమకొండను వేదికగా ఎంపిక చేశారనేది తాజా సమాచారం. అభిమానుల సమక్షంలో జరగనున్న ఈ ఫంక్షన్ కి, ఈ నెల 16వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. దర్శక నిర్మాతలు .. నాని.. సాయిపల్లవితో పాటు టీమ్ లోని మిగతా సభ్యులు హాజరుకానున్నారు. ఈ సినిమాలో భూమిక కీలకమైన పాత్రను పోషించింది. ఈ పాత్ర ఆమెను బిజీ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.           

More Telugu News