prtrol bunk: పెట్రోల్ బంక్ వ‌ద్ద మొబైల్ ఫోన్ ఉప‌యోగించడంతో మంట‌లు.. వీడియోను పోస్ట్ చేసిన పోలీసులు!

  • వీడియో పోస్ట్ చేసిన హైద‌రాబాద్ పోలీసులు
  • పెట్రోల్ బంక్‌ల వ‌ద్ద‌ సెల్‌ఫోన్ ఉప‌యోగించ‌కూడ‌ద‌ని హెచ్చ‌రిక‌
  • జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచ‌న‌

పెట్రోల్ బంక్ వ‌ద్ద మొబైల్ ఫోన్ ఉప‌యోగించకూడ‌ద‌ని ఎంత‌గా చెప్పినా కొంత‌మంది మాత్రం త‌మ‌కేం కాదంటూ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తుంటారు. 'ఇక్క‌డ‌ సెల్‌ఫోన్ వాడ‌కూడ‌దు' అంటూ ప్ర‌తి పెట్రోల్ బంక్ వ‌ద్ద హెచ్చ‌రిక బోర్టుల‌ను కూడా రాసి పెడ‌తారు. అయిన‌ప్ప‌టికీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ కొంద‌రు ప్రమాదాలకు కారకులవుతున్నారు.

ఈ విష‌యాన్ని తెలుపుతూ ఈ రోజు హైద‌రాబాద్ పోలీసులు త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ ద్విచ‌క్ర‌వాహ‌నదారుడు త‌న కుమారుడితో క‌లిసి పెట్రోల్ బంకుకి వ‌చ్చి పెట్రోల్ పోయించుకుంటున్నాడు. ఈ స‌మ‌యంలో సెల్‌ఫోన్ ఉప‌యోగించ‌డంతో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగి బైకుకి అంటుకున్నాయి. ఆ బైకుపై కూర్చున్న చిన్నారి కాలికి కూడా మంట‌లు అంటుకున్నాయి. అయితే, ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో పోలీసులు తెల‌ప‌లేదు.

పెట్రోల్ బంక్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పోలీసులు సూచించారు. సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే తరంగాలు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ హైఎనర్జీని మోసుకొస్తాయి. చిన్న రాపిడికి కూడా స్పందించగల పెట్రోల్‌ను సెల్‌ఫోన్ ద్వారా వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ ప్రభావితం చేయగలదు. దీనివ‌ల్ల మంటలు చెల‌రేగే ప్ర‌మాదం ఉంది.


<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Don't Use Mobile phone at Petrol Pump <a href="https://t.co/AXj9BV82og">pic.twitter.com/AXj9BV82og</a></p>— hyderabadpolice (@hydcitypolice) <a href="https://twitter.com/hydcitypolice/status/941170744192409600?ref_src=twsrc%5Etfw">December 14, 2017</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News