Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మల్టీ స్టారర్ లో రకుల్ ప్రీత్ సింగ్?
  • కొత్త చిత్రానికి ఓకే చెప్పిన రవితేజ 
  • '2 కంట్రీస్' ఆడియో వేడుక 
  • 'ఆటగాళ్లు'గా జగపతిబాబు, నారా రోహిత్  

*  హరీష్ శంకర్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. నితిన్, శర్వానంద్ హీరోలుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. ఇందులో ఓ కథానాయికగా ఇప్పటికే సాయిపల్లవిని అనుకుంటున్నారు. మరో నాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటించే చాన్స్ వుందని సమాచారం.
*  రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తమ ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు.      
*  హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన '2 కంట్రీస్' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఆడియో సీడీలను హీరో నాని విడుదల చేశాడు.
*  జగపతిబాబు, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఆటగాళ్లు' చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.  

More Telugu News