మంత్రి కేటీఆర్: తెలంగాణలో మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు: మంత్రి కేటీఆర్

  • దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో  ఏర్పాటు కానున్న పార్కు 
  • శ్రేయి ఇన్ప్రాస్టక్చర్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
  • 500 ఎకరాల విస్తీర్ణంలో యంత్ర పరికరాల తయారీ పార్కు

తెలంగాణలో మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు ఉదయం ఏక్స్ కాన్- 2017 సదస్సులో భాగంగా ‘నెక్ట్స్ జెన్ ఇన్ప్రాస్టక్చర్’ అనే అంశంపై హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్వీ దేశ్ పాండేతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.

అనంతరం, మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, దేశ నలుమూలలకు ఇక్కడి నుంచి సరుకుల రవాణా సులభంగా ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణాలు, ప్రాజెక్టులు, మైనింగ్ వంటి మౌలిక వసతుల పనుల్లో ఉపయోగించే పరికరాల తయారీకి సంబంధించి ప్రత్యేకంగా ఒక పార్కును ఏర్పాటు చేయనుండటం దేశంలో తొలిసారిగా తెలంగాణలోనే అని అన్నారు.

ఈ పార్క్ ఏర్పాటు నిమిత్తం శ్రేయి ఇన్ప్రాస్టక్చర్ కంపెనీ (ఒట్టివో ఎకనమిక్ జోన్స్ ) తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని ఈ రోజు చేసుకున్నట్టు తెలిపారు. బెంగుళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం జహీరాబాద్ లోని నేషనల్ ఇన్వెస్ట్ మెంట్, మాన్యూఫాక్చరింగ్ జోన్ లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పెట్టుబడులతో వచ్చే తొలి 5 యాంకర్ పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చే సాధారణ రాయితీలకు అదనంగా మరిన్ని రాయితీలను అందిస్తామని, ఇప్పటికే ఈ పార్కులో పెట్టుబడులను పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్టు పేర్కొన్నారు. పార్కుకు సంబంధించిన భూ సేకరణ పూర్తయిందని, త్వరలోనే లాంఛనంగా శంకుస్థాపన చేస్తామన్నారు. మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు ప్రత్యేకతల గురించి కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే..

* సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో యంత్ర పరికరాల తయారీ పార్కు
* ఈ పార్కులోనే భారీ యంత్రపరికరాల తయారీ యూనిట్లు
* రానున్న పదేళ్లలో 10 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం
* ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మేకర్స్ (ఓఈఎం) సంస్థ తయారీ యూనిట్లు

More Telugu News