janasena: జనసేనకి కూడా అనుమానాలున్నాయి.. పోల‌వ‌రం ప్రాజెక్టుపై చంద్ర‌బాబుకి కేవీపీ లేఖ‌!

  • రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు నిల‌దీస్తున్నాయి
  • తప్పేమీ చేయకపోతే శ్వేతప్రత్రం ఎందుకు విడుద‌ల చేయ‌రు?
  • అసలు ఈ ప్రాజెక్ట్ ను ఎప్పటికి పూర్తి చేస్తారు?
  • ప్రాజెక్ట్ ను ఈరోజు గందరగోళ పరిస్థికి తెచ్చారు

విభజన సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో పాటు, ప్రాజెక్ట్ మొత్తాన్ని తామే నిర్మించి ఇస్తామని కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు ఏపీ ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతోన్న నేప‌థ్యంలో ఈ రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఆయ‌న లేఖ రాశారు.

పార్లమెంట్ సాక్షిగా అప్పటి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింద‌ని..అయిన‌ప్ప‌టికీ జాతీయ ప్రాజెక్ట్ లు ఏవీ సకాలంలో పూర్తి కావడం లేదని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పెట్టిన అనేక షరతులను ఒప్పుకొంటూ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మీ చేతులలలోకి తీసుకొని.. అంచనాలను కేంద్ర అనుమతి లేకుండా, మీకు నచ్చిన రీతిలో పెంచుకొంటూ.. ప్రాజెక్ట్ ను ఈరోజు గందరగోళ పరిస్థికి తెచ్చారని కేవీపీ విమ‌ర్శించారు.

రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు, చివరకు జనసేకి కూడా ప్రాజెక్ట్ నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. తప్పేమీ చేయకపోతే శ్వేతప్రత్రం ఎందుకు విడుద‌ల చేయడం లేద‌ని అన్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ను ఎప్పటికి పూర్తి చేస్తారు? అని ప్ర‌శ్నించారు. ఏపీ ప్ర‌భుత్వం పోలవరం నిధుల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వంతో రహస్య ఒప్పందాలు చేసుకొంటే.. రాష్ట్ర ప్రజలు క్షమించరని అన్నారు.

More Telugu News