queen: ఫ్రాన్స్ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న రాణులు... సోష‌ల్ మీడియాలో ఫొటోలు

  • ఒకేసారి నాలుగు భాష‌ల్లో క్వీన్ రీమేక్‌
  • ఫొటోలు దిగిన కాజ‌ల్‌, త‌మ‌న్నా, పారుల్ యాద‌వ్‌, మంజిమా మోహ‌న్‌
  • ఫ్రాన్స్‌లోని ఫ్రెయూజ్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన షూటింగ్‌

బాలీవుడ్ చిత్రం 'క్వీన్' ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఫ్రాన్స్ షెడ్యూల్ ఇటీవ‌ల పూర్త‌యింది. దీంతో నాలుగు భాష‌ల రాణులు అక్క‌డ స‌ర‌దాగా దిగిన కొన్ని ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఫొటోల్లో క‌న్న‌డ 'బ‌ట‌ర్‌ఫ్లై'లో న‌టిస్తున్న పారుల్ యాద‌వ్‌, తెలుగు 'క్వీన్ వ‌న్స్ అగైన్‌'లో న‌టిస్తున్న త‌మ‌న్నా, త‌మిళ 'పారిస్ పారిస్‌'లో న‌టిస్తున్న కాజ‌ల్‌, మ‌ల‌యాళ 'జామ్ జామ్‌'లో న‌టిస్తున్న మంజిమా మోహ‌న్‌లు ఉన్నారు. ఫ్రాన్స్‌లోని ఫ్రెయూజ్ ప‌ట్ట‌ణంలో ఈ చిత్రం షూటింగ్ జ‌రిగింది.

  

More Telugu News