china: 1180 డ్రోన్ల‌తో ఆకాశంలో అద్భుతం... వీడియో చూడండి!

  • చైనాలోని గ్వాంగ్జూలో లైట్ షో
  • ఆక‌ట్టుకున్న ప్ర‌ద‌ర్శ‌న‌
  • ఒక్కో డ్రోన్ ఖ‌ర్చు 1500 డాల‌ర్లు

టెక్నాల‌జీ ప్ర‌ద‌ర్శ‌న‌ విష‌యానికి వ‌చ్చే స‌రికి జ‌పాన్‌, చైనా దేశాలు ముందంజ‌లో ఉంటాయి. అందుకే వారి వారి సాంకేతిక అభివృద్ధిని ప్ర‌ద‌ర్శించ‌డానికి వేడుక‌లు నిర్వ‌హిస్తుంటాయి. ఇటీవ‌ల చైనాలోని గ్వాంగ్జూలో అలాంటి ఒక ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఈ లైట్ షో 1180 డ్రోన్ల‌ను ఉప‌యోగించి ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్క‌రించారు. చైనా అక్ష‌రాల‌ను, ఇంగ్లీషులో 'ఫార్చ్యూన్ గ్లోబ‌ల్ ఫోరం' అనే పేరును, కొన్ని బొమ్మ‌ల‌ను ఆకాశంలో క‌నప‌డేలా చేస్తూ నిర్వ‌హించిన ఈ ప్ర‌ద‌ర్శ‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అక్క‌డి ఈహాంగ్ అనే టెక్నాలజీ కంపెనీ ఈ డ్రోన్ల‌ను త‌యారుచేసింది. ఈ ప్ర‌ద‌ర్శ‌న కోసం ఉప‌యోగించిన ఒక్కో డ్రోను త‌యారీకి 1500 డాల‌ర్ల‌కి పైగా ఖర్చ‌యినట్లు తెలుస్తోంది.

More Telugu News