Virat Kohli: అనుష్క కంటే ముందు త‌మ‌న్నాతో విరాట్ డేటింగ్?

  • త‌మ‌న్నాతో క‌లిసి ఓ ప్ర‌క‌ట‌న‌లో న‌టించిన క్రికెట‌ర్‌
  • 2013లో విడిపోయిన విరాట్, త‌మ‌న్నా
  • ఆ త‌ర్వాత మ‌రో న‌టితో కూడా విరాట్ డేటింగ్‌

ఇటీవ‌ల బాలీవుడ్ సుంద‌రి అనుష్క శ‌ర్మను ఇట‌లీలో వివాహ‌మాడిన క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, ఆమె కంటే ముందు ఇద్ద‌రు బాలీవుడ్ బ్యూటీల‌తో డేటింగ్ చేశార‌ట‌. వారిలో ద‌క్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన త‌మ‌న్నా కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రూ సంవ‌త్స‌రం పాటు డేటింగ్ చేశారు. ఓ మొబైల్ కంపెనీ ప్ర‌క‌ట‌న‌లో వీరిద్ద‌రూ క‌లిసి నటించారు. అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య కుదిరిన స్నేహం, డేటింగ్ వ‌ర‌కు వ‌చ్చింద‌ట‌.

అయితే 2013లో బ్రెజిలియ‌న్ సుంద‌రి ఇస‌బెల్ లేతే రంగ‌ప్ర‌వేశంతో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ట‌. ఓ వ్యాపార‌వేత్త నిర్వ‌హించిన వేడుక‌లో విరాట్‌, ఇస‌బెల్‌ను క‌లిశాడు. ఆమె ఒక బాలీవుడ్ సినిమాలో కూడా న‌టించింది. త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచిన‌ట్లు, ఇద్ద‌రూ క‌లిసి సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు కూడా వెళ్లినట్లు అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి. కానీ వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. ఆ త‌ర్వాత విరాట్‌, అనుష్క రూపంలో తన లేడీ ల‌వ్‌ను క‌లిశాడు. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడు.

More Telugu News